Fri Dec 05 2025 13:34:37 GMT+0000 (Coordinated Universal Time)
మియాపూర్ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు చర్యలు తీసుకున్నారు

మియాపూర్ ఎస్ఐ గిరీష్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఒక కేసులో స్టేషన్ కు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ గిరీష్ కుమార్ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒక సివిల్ కేసులో ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా కొందరిని బెదిరిస్తున్నారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి నిర్ణయం తీసుకున్నారు.
శాఖాపరమైన విచారణ...
ఆయన పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో తేలితే గిరీష్ కుమార్ పై మరింత చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసు వర్గాలు చెప్పాయి. ఆయనపై అనేక మంది గతంలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మారి నూతన అధికారులు రావడంతో వేటు పడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Next Story

