Fri Dec 05 2025 12:03:49 GMT+0000 (Coordinated Universal Time)
Asad : ఎవరికీ భయపడేది లేదు.. బెదిరింపులకు లొంగేది లేదు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్ లు కూడా పెడుతూ తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అయితే ఇటువంటి బెదిరింపులకు తాను భయపడబోనని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ముస్లింలపై ద్వేషం పెంచుకుందని అన్న అసదుద్దీన్ ఒవైసీ అస్సాంలో ముస్లింల జనాభా నలభై శాతం దాటిందంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అంటన్నారన్నారు.
చంపేస్తామంటూ...
కానీ అస్సాంలో కేవలం 34 శాతం మంది మాత్రమే ముస్లిం జనాభా ఉందని చెప్పారు. తాము బలహీన వర్గాల వాయిస్ ను వినిపిస్తుంటే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తనపై గతంలో జరిగిన దాడుల విషయంలోనూ ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తన ఇంటిపైన కూడా కొందరు దాడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ తాను అణగారిన వర్గాలైన బీసీ, ఎస్సీ, ముస్లిం వర్గాల సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటానని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.
Next Story

