Fri Dec 05 2025 21:40:39 GMT+0000 (Coordinated Universal Time)
కొకైన్ దొరికినా ఎందుకు అరెస్ట్ చేయలేదో?
పబ్ లో డ్రగ్స్ కేసులపై ఎంఐఎం అధినేత అసుదద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

పబ్ లో డ్రగ్స్ కేసులపై ఎంఐఎం అధినేత అసుదద్దీన్ ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ లో పబ్ లో పట్టుబడిన డ్రగ్స్ కేసులో యజమాని తప్ప మరెవ్వరూ అరెస్ట్ కాకపోవడంపై అసద్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పబ్ లో కొకైన్ దొరికిందని చెబుతున్న పోలీసులు ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయకపోవడమేంటని అసదుద్దీన్ ప్రశ్నించారు. ఇది దురదృష్టకరమని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
డబ్బున్న వారిని...
బాగా డబ్బున్న వారు కావడంతో అందరినీ వదిలేసినట్లుందని అసదుద్దీన్ ఎద్దేవా చేశఆరు. చట్టం అందరికీ సమానంగా వర్తింప చేయాలని కోరిన అసద్ పేదలు, ధనవంతులందరికీ చట్టాన్ని సమానంగా ఉండేలా చూడాలని అసదుద్దీన్ కోరారు. తన ట్వీట్ ను మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ లను అసద్ ట్యాగ్ చేశారు.
Next Story

