Thu Mar 19 2026 16:42:05 GMT+0530 (India Standard Time)
Breaking : అక్బరుద్దీన్ ముందంజ
పోస్టల్ బ్యాలట్ లో చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు

పోస్టల్ బ్యాలట్ లో చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. తొలుత లెక్కించిన పోస్టల్ బ్యాలట్స్ లో ఆయన ముందంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్నారు.
ఆరోసారి....
చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్ 1999, 2004, 2009, 2014, 2019 విజయం సాధించారు. ఆరోసారి విజయం కోసం ఆయన వేచి చూస్తున్నారు. ఇక్కడ ప్రత్యర్థి నామమాత్రమే అవుతారని తొలి నుంచి వేస్తున్న అంచనాలు నిజమే అవుతున్నాయి. ఆయన గెలుపు ఖాయమని ఇప్పటికే ఎంఐఎం వర్గాలు సంబరాలకు సిద్ధమవుతున్నాయి.
Next Story

