Mon Mar 16 2026 15:33:05 GMT+0530 (India Standard Time)
Hyderabad : కూల్ న్యూస్.. హైదరాబాద్ వాసులకు మాత్రమే
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లోనూ నేడు, రేపు చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు దంచి కొడుతున్న సమయంలో వాతావరణ శాఖ వర్షం కురుస్తుందని చెప్పడంతో కూల్ వాతావరణం నెలకొనే అవకాశముంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రాత్రి వేళ వర్షాలు కురుస్తున్నాయి.
రెండు రోజులు...
ఈ ఏడాది ఎండలు దంచి కొట్టాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్తు వినియోగం కూడా ఎక్కువగా ఉండటంతో కరెంట్ బిల్లుల మోత కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ వాసులకు చల్లనికబురు చెప్పింది.
Next Story

