Fri Jan 30 2026 01:13:22 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మరో రెండు రోజులు కుండపోత వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కుండ పోత వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. హైదరాబాద్ లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే గత ఇరవై రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షంతో ప్రజలు విసిగిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా భారీ వర్షాలు తెలంగాణలో కురిసే అవకాశముందని తెలిపింది.
ఈ జిల్లాలకు...
మరో రెండు రోజులు వర్షాలు తప్పవని హెచ్చరించడంతో ఇప్పటికే నిండుకుండలా మారిన జలాశయాలతో ప్రమాదం జరుగుతుందన్న ఆందోళన కలిగిస్తుంది. మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, కుమరం భీ ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, సూర్యాపేట, వికారాబాద్, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
Next Story

