Sun Mar 15 2026 11:09:18 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని పేర్కొంది.

హైదరాబాద్ కు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కనిష్టంగా 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ జోన్ లలో ....
సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ లలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ వాసుల జాగ్రత్తగా ఉ:డాలని, చలితీవ్రత పెరగడమే కాకుండా, చలిగాలులు, పొగమంచు కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
Next Story

