Tue Mar 17 2026 01:17:50 GMT+0530 (India Standard Time)
హైదరాబాదీలకు అలర్ట్
హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

హైదరాబాద్ వాసులకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.
రెండు రోజుల పాటు...
ఎండలు మండిపోతున్న సమయంలో హైదరాబాద్ వాసులకు ఈ వర్షం కొంత ఊరట కల్గించేదే. మండే ఎండల్లో ఉపశమనంగా ఉంటుంది. అయితే ఈదురుగాలుల వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా హైదరాబాదీలు చూసుకోవడం మంచిదన్న హెచ్చరికలు కూడా జారీ చేసింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ మీదుగా కర్ణాటక, తమిళనాడు వరకూ ఏర్పడిన ద్రోణి కారణంగానే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Next Story

