Fri Dec 05 2025 13:25:27 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్ జారీ అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక
హైదరాబాద్ లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరికొద్ది గంటల్లో భఆరీ వర్షం పడుతుందని హెచ్చరించింది.

హైదరాబాద్ లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరికొద్ది గంటల్లో భఆరీ వర్షం పడుతుందని హెచ్చరించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. నగరవాసులు ఈరోజు సెలవు పెట్టి విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉండటమే మేలని సూచించింది.నిన్నటి నుండి కురుస్తున్న వాన ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో ఇప్పటికే రహదారులపైకి మూడు అడుగుల నీరు చేరింది. పాతబస్తీ బండ్లగూడలోకి భారీ వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వ్యక్తి మృతి...
దిల్సుఖ్ నగర్ - చాదర్‌ఘాట్ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోసారి భారీ వర్షం కురుస్తుందని తెలియడంతో నగర వాసులు బితుకుబితుకుమంటూ ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సిబ్బంది మొత్తం రోడ్లమీదనే ఉండి సహాయక చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. పార్శిగుట్టలో నిన్న కురిసిన భారీ వర్షానికి అనిల్ అనే వ్యక్తి కొట్టుకుపోయాడు. అనిల్ బైకుతో సహా కొట్టుకుపోయాడు. రామ్‌నగర్ లో అనిల్ మృతదేహాం కనిపించింది. దీంతో డేంజర్ బెల్స్ ను మోగించింది.
వాహనాలు...
కాలనీల్లోకి వరద నీరు చేరడంతో అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. ద్విచక్రవాహనాలు మాత్రమే కాదు కార్లు కూడా కనిపించకుండా పోవడంతో వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు గంటల్లో మరోసారి భారీ వర్షం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో వారు పడే అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మ్యాన్‌హోల్ మూతలు ఎవరూ తొలగించవద్దని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో ఎవరూ వాహనాలను తీసుకుని డ్రైవ్ చేసి ప్రమాదంలో పడొద్దని సూచిస్తున్నారు.
Next Story

