Mon Mar 16 2026 00:32:44 GMT+0530 (India Standard Time)
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో రామ్ చరణ్
మెగా హీరో రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చారు

మెగా హీరో రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అక్కడకు వచ్చారు. రామ్ చరణ్ ఎప్పటికప్పుడు తన వాహనాలను మారుస్తూ ఉంటారు. కొత్త మోడల్స్ వస్తే వెంటనే కొనుగోలు చేస్తారు. తాజాగా రోల్స్ రాయ్స్ వాహనాన్ని రామ్ చరణ్ కొనుగోలు చేశారు.
వాహనం రిజిస్ట్రేషన్ కోసం...
రోల్స్ రాయ్స్ వాహనం కోసం రిజిస్ట్రేషన్ కు రావడంతో అక్కడ సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు ఉద్యోగులతో పాటు వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వచ్చిన వారు కూడా ఎగబడ్డారు. రామ్ చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. రిజిస్ట్రేషన్ ఫారాలపై సంతకాలు చేసిన రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు.
Next Story

