Fri Jan 09 2026 22:33:48 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీలో పథ్నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ అరైవల్ వద్ద జరిపిన తనిఖీల్లో ఈ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు ప్రయాణికుల నుంచి...
ఖతార్ నుంచి హైదరాబాద్ కు ఇద్దరు ప్రయాణికులు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుననారు. లగేజీలో రహస్యంగా దాచిపెట్టిన గంజాయి పొట్లాలను స్కానింగ్ సమయంలో గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పథ్నాలుగు కోట్ల విలువైన గంజాయి హైడ్రోపోనిక్ గంజాయి అని, వీటి విలువ పథ్నాలుగు కోట్ల రూపాయల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. అయితే ఈ తనిఖీల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారిని విచారిస్తున్నారు.
Next Story

