Fri Dec 05 2025 13:22:03 GMT+0000 (Coordinated Universal Time)
దిగొచ్చిన తాజ్ బంజారా... సగం మొత్తం చెల్లించి
తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం దిగివచ్చింది. సగం మొత్తాన్నిచెల్లించిందని చెబుతున్నారు

తాజ్ బంజారా హోటల్ యాజమాన్యం దిగివచ్చింది. తాము చెల్లించాల్సిన ఆస్తి పన్నులో సగం మొత్తాన్నిచెల్లించింది. మిగిలిన మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లిస్తామని పేర్కొంది. బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా ఫైవ్ స్టార్ హోటల్ ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. 1.43 కోట్ల బకాయీల ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు.
సీజ్ చేయడంతో...
రెండేళ్ల నుంచి ఆస్తి పన్నును చెల్లించకపోవడంతో అధికారులు సీజ్ చేశారు. ఎన్నిమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను సీజ్ చేశారు. అయితే సీజ్ చేయడంతో దిగి వచ్చిన యాజమాన్యం సగం చెల్లించింది. రెండు వేల కోట్ల రూపాయల బకాయీలు ఉన్నాయని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. మార్చి 31వ తేదీలోగా బకాయీలను చెల్లించాలని అధికారులు అల్టిమేటం ఇచ్చారు.
Next Story

