Fri Nov 08 2024 15:45:21 GMT+0000 (Coordinated Universal Time)
హెర్బల్ లైఫ్ పేరుతో మహిళలపై ఆగడాలు..
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. చంద్రశేఖర్ ఏకంగా 20 మంది మహిళల్ని న్యూడ్ కాల్స్ తో వేధించినట్లు విచారణలో వెల్లడైంది. మహిళల..
హైర్బల్ లైఫ్.. ఇప్పుడు అధిక బరువుతో బాధపడుతున్నవారు ఎలాంటి మందులు వాడకుండా.. కొన్ని షేక్స్ అండ్ సప్లిమెంట్స్ ద్వారా బరువు తగ్గేందుకు ఎంచుకుంటున్న మార్గం ఇది. వాళ్లు చెప్పే డైట్, వ్యాయామాలతో పాటు కొన్ని ఆహారపు అలవాట్లను మార్చుకుంటే.. బరువు తగ్గుతారు. అయితే.. ఈ హెర్బల్ లైఫ్ ను అడ్డం పెట్టుకుని ఓ వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వారిని న్యూడ్ కాల్స్ తో వేధించాడు. అతనే హైదరాబాద్ కేపీహెచ్ బీ కి చెందిన హెర్బల్ లైఫ్ మేనేజర్ చంద్రశేఖర్. తాజాగా అతడిని కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేయగా.. విచారణలో అతను చేసిన దారుణాలు వెలుగుచూస్తున్నాయి.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. చంద్రశేఖర్ ఏకంగా 20 మంది మహిళల్ని న్యూడ్ కాల్స్ తో వేధించినట్లు విచారణలో వెల్లడైంది. మహిళల బాడీ పార్ట్స్ గురించి చెబుతూ వీడియో కాల్స్‌లో పోకిరీ చేష్టలు చేసేవాడని తేలింది. ఏడాది క్రితం హెర్బల్ లైఫ్‌లో మేనేజర్‌గా చేరిన చంద్రశేఖర్.. వెయిట్‌లాస్ కోసం వచ్చే మహిళలను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. తొలుత మంచివాడిలా మాట్లాడుతూ.. నెమ్మదిగా వారితో చనువు పెంచుకుని న్యూడ్ కాల్స్ చేస్తూ వేధింపులకు గురిచేసేవాడు. ఫిట్ నెస్ క్లాసుల పేరుతో ఫోన్ నంబర్లు తీసుకుని మహిళలను లొంగదీసుకునేందుకు ప్రయత్నించేవాడని కేపీహెచ్ బీ పోలీసులు పేర్కొన్నారు. చంద్రశేఖర్ ఫోన్ నుంచి కుప్పలకొద్దీ న్యూడ్ కాల్స్ వీడియోలు, అశ్లీల చాట్స్, పెద్దఎత్తున మహిళల ఫోన్ నెంబర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇకనైనా మహిళలు అందరినీ గుడ్డిగా నమ్మడం మానుకోవాలని, ముఖ్యంగా మాటలు కలిపే మగవాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Next Story