Thu Feb 26 2026 13:55:30 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్ లోని వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. జూబ్లీహిల్స్ లోని రోడ్డు నెంబరు 36లో ఉన్న మంగళగౌరి వస్త్ర దుకాణంతో పాటు మాన్యవర్ షాపులోనూ మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు.
లోపల చిక్కుకున్న సిబ్బందిని...
లోపల సిబ్బంది చిక్కుకున్నారని, వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు వైపుల బంగారు దుకాణాలు ఉండటంతో వెంటనే ఆ షాపులల యజమానులు అప్రమత్తమయ్యారు. మంటలు ఎగిసి పడుతున్నాయి. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. రెండు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.
Next Story

