Wed Feb 25 2026 19:26:28 GMT+0530 (India Standard Time)
యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు
యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు

యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. కరాటే కళ్యాణి గతేడాది పంజాగుట్టలో అతడిపై ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో అన్వేష్‌పై పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు. ఈమేరకు తాజాగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
విదేశాల్లో ఉంటూ...
విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన నేపథ్యంలో అతనిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అన్వేష్ దీనికి సంబంధించి క్షమాపణలు ఇప్పటికే చెప్పారు. అయితే అతనిపై కేసు నమోదు కావడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Next Story

