Fri Dec 05 2025 13:15:20 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు హైదరాబాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక
నేడు హైదరాబాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది

నేడు హైదరాబాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ ఎన్నికను అధికారులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ తో పాటు కౌంటింగ్ ను కూడా నిర్వహిస్తున్నారు.
రెండు పోలింగ్ కేంద్రాలు...
ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ అఫిషియో సభ్యులకు రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

