Sun Mar 15 2026 17:42:11 GMT+0530 (India Standard Time)
నేడు మద్యం దుకాణాల బంద్
నేడు హైదరాబాద్ లో మద్యం దుకాణాలను బంద్ కానున్నాయి.

నేడు హైదరాబాద్ లో మద్యం దుకాణాలను బంద్ కానున్నాయి. ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకూ వైన్ షాపులు బంద్ చేయాలని ఇప్పటికే నగర పోలీసు కమిషన్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నిబంధనలను అందరూ పాటించాలని కోరారు.
కఠిన చర్యలు...
ఎవరైనా షాపులు తెరిచి ఉంచినా, మద్యాన్ని విక్రయించినట్లు తెలిసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని శ్రీరామ నవమి రోజు నగరంలోని అన్ని వైన్ షాపులను బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. దీంతో ఈరోజు నగరంలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.
Next Story

