Sun Mar 15 2026 20:55:13 GMT+0530 (India Standard Time)
మందుబాబులకు షాక్... రెండు రోజులు బంద్
హైదరాబాద్ లో మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు బంద్ చేయనున్నారు.

హైదరాబాద్ లో మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు బంద్ చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ హైదరాబాద్ లో మద్యం దుకాణాలను బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. శాంతి భద్రతల దృష్ట్యా 48 గంటల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీరామనవమి సందర్భంగా....
రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. శోభాయాత్రలు వంటివి ఉండటంతో మద్యం దుకాణాలను మూసి వేయాలని నిర్ణయించారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Next Story

