Fri Dec 05 2025 09:25:49 GMT+0000 (Coordinated Universal Time)
Leopard : హైదరాబాద్ శివార్లలో చిరుతపులి
హైదరాబాద్ శివార్లలో గండిపేట చెరువు వద్ద ఉన్న మంచిరేవుల వద్ద చిరుత సంచారం కలకలం రేపింది

హైదరాబాద్ శివార్లలో గండిపేట చెరువు వద్ద ఉన్న మంచిరేవుల వద్ద చిరుత సంచారం కలకలం రేపింది. హైదరాబాద్ శివారులో ఈ చిరుత కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాప్ కెమెరాలకు కూడా చిరుత చిక్కింది. నైట్ రౌండ్స్ లో ఉన్న గ్రేహౌండ్స్ సిబ్బందికి కూడా చిరుత కనిపించింది. ఒక కొండ రాయిపై చిరుత పులి కూర్చుని ఉండటం కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
గండిపేట చెరువు వద్ద ఉన్న...
ఈ చిరుతపులి గత కొన్నాళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే తిరుగుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని అంటున్నారు. అందుకే ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారంటున్నారు. హైదరాబాద్ లో చిరుతపులి సంచరిస్తుండటంతో అది నగరంలోకి వస్తుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.
Next Story

