Sat Feb 28 2026 10:53:04 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ కె .పి.హెచ్. బిలో రికార్డు స్థాయిపలికిన గజం భూమి ధర
హైదరాబాద్ నగరంలో స్థలాలు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో స్థలాలు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. అందులో ఎలాంటి వివాదాలు లేకుండా హౌసింగ్ బోర్డు వేలం ద్వారా నిర్వహించిన భూములను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. తాజాగా కూకట్ పల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో హౌసింగ్ బోర్డు నిర్వహించిన వేలానికి భూములు రికార్డు స్థాయిలో ధరలు పలికాయి.
గజం రెండున్నర లక్షలు...
హైదరాబాద్ లోని కే .పీ.హెచ్. బిలో నాలుగు స్థలాలు, ఎనిమిది ఫ్లాట్లను హౌసింగ్ బోర్డు వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. గజానికి గరిష్టంగా 2.5 లక్షల రూపాయలు ధర పలికింది. కే .పీ.హెచ్. బి 15వ ఫేజ్ లో 1,400 ఎస్ఎఫ్ఎ ఫ్లాట్ రూ.1.10 కోట్లు ధర పలికింది. స్థలాలు, ఫ్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం సమకూరింది. ఇటీవల గచ్చిబౌలిలో నిర్వహించిన వేలంలో భూమి చదరపు గజం రూ.1.76 లక్షలు పలికింది
Next Story

