Sun Dec 14 2025 00:23:35 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కోకాపేట్ భూములు మళ్లీ రికార్డు బ్రేక్
హైదరాబాద్ లోని కోకాపేట భూములు మరోసారి రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి

హైదరాబాద్ లోని కోకాపేట భూములు మరోసారి రికార్డు ధరలకు అమ్ముడుపోయాయి. రెండు ప్లాట్లకు హెచ్ఎండీఏ అధికారులు నేడు వేలం వేశారు.ప్లాట్ నెంబరు 15, 16 లను వేలంలో ఉంచారు. నియోపోలిస్ ప్రాంతంలో ఉండటంతో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. ప్లాట్ నెంబరు 15 లో ఎకారా భూమిని 151.25 కోట్లకు జీహెచ్ఆర్ సంస్థ కొనుగోలు చేసింది.
151.25 కోట్లకు...
మరొకవైపు ప్లాట్ నెంబరు 16ను గోద్రెజ్ సంస్థ దక్కించుకుంది. ఎకరా భూమి147.75కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో గతంలో కంటే రికార్డు స్థాయిలో కోకాపేట భూముల ధరలు అమ్ముడుపోయాయి. రెండు ప్లాట్లకు సంబంధించిన వేలాన్ని ఈరోజు హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించడంతో ఈ వేలంలో అగ్రనిర్మాణ సంస్థలు ఈ ప్లాట్లను దక్కించుకున్నట్లయింది.
Next Story

