Sat Jun 21 2025 04:34:26 GMT+0000 (Coordinated Universal Time)
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ప్రభాకర్ రావు.. నేడు సిట్ ఎదుటకు ప్రభాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం జరగనుంది. ఈ కేసులో ముఖ్యమైన నిందితుడిగా పోలీసులు భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు కీలక పరిణామం జరగనుంది. ఈ కేసులో ముఖ్యమైన నిందితుడిగా పోలీసులు భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన అమెరికా నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత ప్రభాకర్ రరావు అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చారు. ఈరోజు ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి.
లుక్ అవుట్ నోటీసులుండటంతో...
ప్రభాకర్ రావు పై లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలోనే నిలిపివేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులోలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లో ప్రభకార్ రరావు పాస్ పోర్ట్ ను స్కానింగ్ చేస్తున్న సమయంలోనే ఆయనపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నట్లు వెల్లడయింది. దీంతో వెంటనే పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసుల నుంచి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత మాత్రమే ప్రభాకర్ రావును హైదరాబాద్ నగరంలోకి అనుమతించారు. అయితే గత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ నేతలతో పాటు పోలీసు అధికారుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కు గురయినట్లు ఆరోపణలున్నాయి.
సుప్రీంకోర్టు ఆదేశాలతో...
దీంతో కేసు నమోదు చేసి ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేశారు. ప్రభాకర్ రావు నేడు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు ప్రబాకర్ రావును విచారించనున్నారు. ప్రభాకర్ రావు కోసం కొన్ని నెలలుగా సిట్ అధికారులు విచారణ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేయవద్దని, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ ఆయనను ఈ కేసులో అదుపులోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పడంతోనే ప్రభాకర్ రరావు హైదరాబాద్ కు వచ్చారు. ఈరోజు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయితే ఏ విషయాలు వెలుగు చూస్తాయన్నది ఆసక్తికరంగా మారనుంది. దీనిపై ఇప్పటికే సిట్ అధికారులు ప్రభాకర్ రావును ప్రశ్నించాల్సిన అంశాలపై కూడా చర్చించి ఒక ప్రత్యేకమైన ప్రశ్నావళిని రూపొందించుకున్నారు.
Next Story