Sat Dec 13 2025 22:34:57 GMT+0000 (Coordinated Universal Time)
Hydra : విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకున్న హైడ్రా
హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన స్థలంలో ఆక్రమణలను తొలగించారు

హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని నిర్మించిన స్థలంలో ఆక్రమణలను తొలగించారు. కర్మనఘాట్లోని సాయి గణేశ్‌నగర్‌లో 450 చదరపు గజాల పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1979లో ఏర్పాటైన లేఅవుట్లో 176 ప్లాట్లతో కలిసి ఈ భూమిని పార్కు కోసం కేటాయించారు. అయితే, ఇటీవల కొంతమంది ఆ ప్రదేశంలో గది నిర్మించారు. రు. వారిని ప్రశ్నించిన స్థానికులకు బెదిరింపులు వచ్చినట్టు నివాసులు తెలిపారు.
ఫిర్యాదులు రావడంతో...
దీంతో స్థానికులు హైడ్రా అధికారులుకు పార్కుకు కేటాయించిన భూమిలో నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. ఆ నిర్మాణం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు కాలేదని ధృవీకరించారు. వెంటనే బుల్డోజర్ను వినియోగించి గోడ, నిర్మించిన గదిని కూల్చేశారు. దీంతో స్థలం మళ్లీ పార్కు కోసం ఖాళీ అయింది.
Next Story

