Fri Dec 05 2025 09:29:46 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : మరో తెలంగాణ ఉద్యమం తప్పదు : కవిత
బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం నిర్వహించారు.

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూపీఎఫ్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నాురు. దాదాపు గంటసేపు ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. బీసీ బంద్ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారని, రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉందని అన్నారు.
రెండు పార్టీలు...
దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయని కల్వకుంట్ల కవిత ఆరోపించారు.హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని కవిత ధ్వజమెత్తారు.బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారని, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపు నిచ్చారు.
Next Story

