Fri Dec 05 2025 09:29:50 GMT+0000 (Coordinated Universal Time)
Kavitha : కవిత కుమారుడు వచ్చేశాడటగా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కుమారుడు ఆదిత్యను రాజకీయ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కుమారుడు ఆదిత్యను రాజకీయ ప్రవేశం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఖైరతాబాద్ లో నిర్వహించిన బీసీ రిజర్వేషన్ల నిరసనకు కుమారుడు ఆదిత్యను కూడా తీసుకువచ్చారు. జాగృతి నేతలతో కలిసి ఆదిత్య ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి నేతలతో కలసి ఆదిత్య నిరసనలో పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కుమారుడిని రాజకీయాల్లోకి దింపే అవకాశముందన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
నేడు ఆందోళనలో...
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత తాను ఇక ఆ పార్టీలో చేరేది లేదని చెప్పారు. ఆ చెట్టు నీడ తనపై ఉండదని తెలిపారు. అందుకే ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగే యాత్రలోనూ కేసీఆర్ ఫొటో పెట్టకుండా సొంతంగానే తాను ఎదిగేందుకు ఆమె సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ లో తనకు జరిగిన అన్యాయం చెప్పినా పట్టించుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న కవిత జాగృతి ద్వారానే తెలంగాణ రాజకీయాల్లో ఎదగాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే కుమారుడిని కూడా తొలిసారి ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేశారని జాగృతి నేతలే చర్చించుకుంటున్నారు.
Next Story

