Wed Apr 01 2026 21:46:52 GMT+0530 (India Standard Time)
Jublee Hills By Elections : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేయాలంటే ఇవి చూపాల్సిందే
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక. నవంబరు 11వ తేదీన జరగనుంది

జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఖచ్చితంగా ఈ గుర్తింపు కార్డులను పోలింగ్ కేంద్రాలకు తీసుకు రావాల్సి ఉంటుంది. పోలింగ్ సందర్భంగా దొంగ ఓట్లు నిరోధించడానికి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పన్నెండు రకాల గుర్తింపు కార్డులను అనుమతి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్ జాబితాను విడుదల చేశారు. అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు.
జాబితాలో పేరున్నప్పటికీ...
ఓటర్ల జాబితాలో పేర్లున్నప్పటికీ వివిధ పార్టీల పోలింగ్ ఏజెంట్లు అభ్యంతరం పెట్టినా ఈ ఐడీ కార్డులు ఉపయోగపడతాయని తెలిపింది. ఓటు హక్కు వినియోగించుకునే ముందు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుందని తెలిపింది. పన్నెండు రకాల గుర్తింపు కార్డులను ఓటింగ్ చేసేందుకు అనుమతిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఫొటో ఉన్న గుర్తింపు కార్డు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదానిని పోలింగ్ కేంద్రానికి తీసుకు రావాలని, అప్పుడే దానిని సరిచూసుకుని పోలింగ్ సిబ్బంది ఓటింగ్ కు అనుమతిస్తారని తెలిపారు.
ఈ కార్డులు తీసుకుని రావాలి
ఆధార్ కార్డు
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు
బ్యాంకు లేదా పోస్టాఫీస్ ఫోటో పాస్బుక్
కార్మిక శాఖ లేదా ఆయుష్మాన్ భారత్ పథకం జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
పాన్ కార్డు
నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ కింద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు
విదేశాంగ మంత్రిత్వశాఖ జారీ చేసిన భారత పాస్పోర్ట్
ఫోటోతో కూడిన పెన్షన్ పత్రం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్యూలు, లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన సేవా గుర్తింపు కార్డు
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
సామాజిక న్యాయశాఖ జారీ చేసిన ప్రత్యేక దివ్యాంగుల గుర్తింపు కార్డు
Next Story

