Sat Dec 13 2025 19:30:04 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : రేపు మద్యం దుకాణాలు బంద్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశించారు

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 10 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. మొదట షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపుతో ప్రారంభమై, చివరగా ఎర్రగడ్డ డివిజన్‌తో ముగుస్తుంది.
లెక్కింపు సందర్భంగా...
లెక్కింపు సందర్భంగా నియోజకవర్గంలో అన్ని మద్యం దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు వంటి మద్యం విక్రయించే ప్రదేశాలు నవంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే ఈ 24 గంటల సమయంలో ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, పటాకుల ప్రదర్శనలు నిషేధించారు.
Next Story

