Mon Mar 16 2026 14:46:25 GMT+0530 (India Standard Time)
కాసేపట్లో చంద్రబాబుతో పవన్ భేటీ
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు

ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి చేరుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చంచనున్నారు. అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకుని వచ్చిన చంద్రబాబును పరామర్శించేందుకు వెళుతున్నారని చెబుతున్నారు.
ఎన్నికల అనంతరం...
అయితే ఎన్నికల అనంతరం మొదటి సారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు భేటీ కానున్నారు. ఇద్దరూ ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లు, పోలింగ్ సరళిపై చర్చించనున్నారు. దీంతో పాటు కౌంటింగ్ సమయంలో రెండు పార్టీల నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గుించి ఇద్దరూ చర్చించనున్నారని తెలిసింది.
Next Story

