Thu Mar 19 2026 10:27:04 GMT+0530 (India Standard Time)
హైదరాభాద్ లో కుండపోత వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గంట నుంచి ఎడతెెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. గంట నుంచి ఎడతెెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. మరో గంట పాటు కుండపోత వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, లేకుంటే ఇళ్లకే పరిమితమవ్వాలని సూచిస్తున్నారు. ప్రయాణాలు సయితం వాయిదా వేసుకుంటే మంచిదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.
గంట నుంచి....
గంట నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో అనేక చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు అష్టకష్టాలు పడుతున్నారు. మరో గంట పాటు ఎడతెరిపి లేని వాన కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడి పోతున్నారు. తమ ఇళ్లల్లోకి వరద నీరు రాకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Next Story

