Tue Mar 17 2026 02:50:03 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ లో వర్షం
హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి వర్షం కురియడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. అర్ధరాత్రి నుంచి వర్షం కురియడంతో చలిగాలులు బలంగా వీస్తున్నాయి. వర్షాకాలం కాకపోయినా ఉన్నట్లుండి వర్షం మొదలయింది. అర్ధరాత్రి నుంచి వేకువ జాము వరకూ వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగర వాసులు వణికిపోయారు. మార్నింగ్ వాక్ కు వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. ఉదయం లేచి చూసిన వారికి వర్షం కురుస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు.
శీతాకాలంలో వర్షం...
శీతాకాలంలో వర్షం పడటంతో చలిగాలులు మరింత పెరిగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాస్ రోడస్, సరూర్ నగర్, దిల్షుక్ నగర్, బేగంపేట్ వంటి ప్రాంతాల్లో ఒక మోస్తరు జల్లులు పడ్డాయి. హైదరాబాద్ శివార్లలో వర్షం బాగానే కురిసింది. జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
Next Story

