Thu Jan 29 2026 08:30:01 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో ఉదయం భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి

హైదరాబాద్ లో ఉదయం భారీ వర్షం కురిసింది. వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమయింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఎవరూ మ్యాన్ హోళ్లను తెరవవద్దని సూచించింది. తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి.
లోతట్టు ప్రాంతాలు...
ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో 24 గంటల పాటు వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ సూచనతో నగర వాసులు భయపడిపోతున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ సిబ్బంది బయటకు తోడుతున్నారు.
Next Story

