Thu Mar 19 2026 04:28:47 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం కురిసింది

హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉద్యోగులు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయిపోయాయి. ద్విచక్ర వాహనదారులు మెట్రో పిల్లర్ల కింద ఉండి తడిసిపోకుండా తమను తాము కాపాడుకుంటున్నారు.
ట్రాఫిక్ జాంతో...
అదే సమయంలో అనేక చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. నిన్న కూడా హైదరాబాద్ లో ఇదే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఇదే సమయంలో వర్షం కురిసి ట్రాఫిక్ జాం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
Next Story

