Sun Mar 08 2026 08:46:16 GMT+0530 (India Standard Time)
Hyderababd : హైదరాబాద్ లో భారీ వర్షం.. తడిసి ముద్దయిన నగరం
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్.బి.నగర్ లోనూ భారీ వర్షపాతం నమోదయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ట్రాఫిక్ నిలిచిపోవడంతో...
భారీ వర్షం కురియడంతో రహదారుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఆదివారం కావడంతో పెద్దగా వాహనాల రద్దీ లేకపోవడంతో కొంత ఇబ్బంది లేకపోయినా అనేక చోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు వచ్చి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సెలవు దినం కావడంతో ప్రజలు తమ వాహనాలతో బయటకు రావడంతో వర్షంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు
Next Story

