Fri Dec 05 2025 16:56:45 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 18న హైదరాబాద్ కు రాష్ట్రపతి రాక
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆరు రోజుల పాటు హైదరాబాద్ లో ఉండనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకూ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ లో ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది.
రాష్ట్రపతి పర్యటనపై...
రాష్ట్రపతి పర్యటనపై చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకడంతో పాటు ఆమె విడిది ఏర్పాట్లు, భద్రతపరమైన చర్యల గురించి శాంతకుమారి సమీక్షించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. రాష్ట్రపతి విడిది చేయనున్న బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు, అక్కడ భద్రతపై ఆమె చర్చించారు. ఈ సమీక్షకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా హాజరయ్యారు.
Next Story

