Sat Mar 07 2026 21:57:51 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్లో నేడు ఓపీ సేవలు బంద్
హైదరాబాద్ లో ఈరోజు ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.

హైదరాబాద్ లో ఈరోజు ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. కోల్కత్తాలో పీజీ వైద్యురాలి హత్యా సoఘటనకు నిరసనగా నేటి ఉదయం నుంచి రేపు ఆరు గంటల వరకూ ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఓపీని బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది.
రేపు ఉదయం వరకూ...
పీజీ వైద్యురాలి పై హత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ నిరసనకు దిగనుంది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లోని ధర్నా చౌక్ లో ఈరోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ప్రయివేటు ఆసుపత్రుల వైద్యులు ధర్నా చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలుంటాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
Next Story

