Mon Mar 16 2026 17:05:23 GMT+0530 (India Standard Time)
Hyderabad : హైదరాబాద్ వాసులకు వార్నింగ్.. మళ్లీ సాయంత్రం ఈదురుగాలులు
తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షం కూడా...
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి జిల్లాలలో వర్షం పడుతుందని తెలిపింది. భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Next Story

