Fri Dec 05 2025 13:55:30 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు
హైదరాబాద్ లోని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి

హైదరాబాద్ లోని మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన సోదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు ఇరవై ఐదు గంటలుగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి డీఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కనస్ట్రక్షన్స్ కార్యాలయాలు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
పన్ను చెల్లింపుల్లో...
డీఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లల్లో కూడా కొనసాగుతున్న ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం ఏకకాలంలో పది చోట్ల కొనసాగుతున్న సోదాలలో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రాడంతో ఐటీ శాఖ అధికారులు అన్ని విషయాలనూ కూలంకషంగా తనిఖీలు చేస్తున్నారని తెలిసింది.
Next Story

