Sun Mar 15 2026 19:32:16 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్లో ఐటీ శాఖ దాడులు
కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు

కింగ్స్ ప్యాలెస్ యజమాని షాన్వాజ్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి పెద్దయెత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతో ఈ సోదాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
షాన్వాజ్ ఇంట్లో సోదాలు...
గతంలోనూ ఐటీ శాఖ అధికారులు షాన్వాజ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమమయంలో ఆయన దుబాయ్ కు వెళ్లిపోయారు. షాన్వాజ్ ను దుబాయ్ నుంచి తీసుకు వచ్చి మరీ సోదాలు చేస్తున్నారు. మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
Next Story

