Fri Dec 05 2025 11:40:35 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ సోదాలు
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు ఇళ్లు, ఆయన కార్యాలయాల్లో ఐటీ అధికారులు రైడ్ చేస్తున్నారు. ఏకకాలంలో ఎనిమిది ప్రాంతాల్లో యాభై ఐదు బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లోని దిల్ ఇల్లుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కుమార్తె హన్సితరెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు.
సినిమాలు విడుదల కావడంతో...
దిల్ రాజుకు చెందిన పార్ట్ నర్స్ కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పన్ను ఎగవేతకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ఛైర్మన్ గా కూడా దిల్ రాజు ఉన్నారు.
Next Story

