Sat Dec 06 2025 03:01:09 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో ఐటీ శాఖ దాడులు
హైదరాబాద్ లో ఆదాయపు పన్ను అధికారుల సోదాలు జరుగుతున్నాయి

హైదరాబాద్ లో ఆదాయపు పన్ను అధికారుల సోదాలు జరుగుతున్నాయి. కొండాపూర్, కూకట్పల్లి ప్రాంతాలలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.కొండాపూర్ అపర్ణ హోమ్స్ లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. బృందాలుగా విడిపోయి ఈ సోదాలను ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏ విషయంలో అన్నది...
అయితే ఏ విషయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుగుతుందన్న విషయంలపై మాత్రం క్లారిటీ లేదు. వ్యాపార విషయాల్లో మనీల్యాండరింగ్ లేకపోతే ఆదాయపు పన్ను సక్రమంగా జమ చేయకపోవడం వల్లనే ఈ సోదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

