Mon Feb 02 2026 11:02:36 GMT+0000 (Coordinated Universal Time)
tollywood : టాలీవుడ్ ప్రముఖల ఇళ్లలో ఐటీ దాడులు
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నిర్మాణ సంస్థల్లో ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలయిన సినిమా నేపథ్యంలో పన్ను ఎగవేశారన్న సమాచారంతో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అందిన సమాచారం మేరకు...
అయితే సోదాలు తమకు అందిన సమాచారం మేరకే నిర్వహిస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. భారీ బడ్జెట్ తో చిత్రాలు నిర్మించిన ఒక నిర్మాత ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలిసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

