Sun Mar 26 2023 08:35:03 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఐటీ సోదాలు
హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ లో ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా కెమికల్స్ ఛైర్మన్ రాజు తో పాటు డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం నలభై చోట్ల సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పెద్దయెత్తున ఆదాయపు పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారం...
పదిహేను కంపెనీల పేరుతో వసుధా కంపెనీ ఛైర్మన్ రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ సంస్థలపై పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ సోదాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
Next Story