Tue Apr 07 2026 01:18:02 GMT+0530 (India Standard Time)
మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి
మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మరణించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. దీంతో బాలిక కుటుంబంలో విషాదం నింపింది

మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మరణించిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. దీంతో బాలిక కుటుంబంలో విషాదం నింపింది. పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన మౌనిక మ్యాన్‌హోల్‌లో పడి బాలిక మృతి చెందింది. ఈరోజు తెల్లవారు జామున హైదరాబాద్‌లో భారీ వర్షం పడింది. వర్షం నీరు రోడ్లపై నిలిచాయి.
మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం...
కళాసిగూడలో ఉదయాన్నే పాల ప్యాకెట్ల నాలుగో తరగతి చదువుతున్న బాలిక బయటకు వచ్చి మ్యాన్‌హోల్‌లో పడింది. దీంతో ఆమె ప్రాణాలను కోల్పోయింది. మున్సిపల్ సిబ్బంది మ్యాన్‌హోల్ మూత తెరిచి ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టకపోవడంతో బాలిక అందులో బయటపడింది. దీంతో మౌనిక కుటుంబంలో విషాదం నెలకొంది. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమే బాలిక ప్రాణం తీసిందని కుటుంబీకులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story

