Sun Mar 15 2026 11:33:44 GMT+0530 (India Standard Time)
Juvenile Home : జువైనల్ హోం నుంచి పిల్లలు పరారీ
జువైనల్ హోంలో ఉంటున్న చిన్నారులు పరారయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది

జువైనల్ హోంలో ఉంటున్న చిన్నారులు పరారయిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. సూరారం పరిధిలోని కైలాస్ నగర్ లో ఉన్న జువైనల్ హోంలో పిల్లలు ఉన్నారు. అయితే అందులో ఎనిమిది మంది పిల్లలు ఈరోజు తప్పించుకున్నారని హోం నిర్వాహకులు సూరారాం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కాన్నారు.
కిటికీ గ్రిల్స్ ను తొలగించి...
కిటికీ గ్రిల్స్ ను తొలగించి పిల్లలు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఆధారంగా పిల్లలు ఎటు వైపు వెళ్లిందీ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. పిల్లలు వెళ్లిన రూట్లలో పోలీసులు వెదుకులాటను ప్రారంభించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

