Sat Mar 07 2026 21:21:51 GMT+0530 (India Standard Time)
మూడు నెలలు ఇటు రావద్దు
హైదరాబాద్లో మూడు నెలలు అటు వైపు వెళ్ల వద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు

హైదరాబాద్లో మూడు నెలలు అటు వైపు వెళ్ల వద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిక బోర్డులు పెట్టారు. మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ రోడ్డు వైపు శిల్పా లే అవుట్ ఫేజ్ 2 వంతెన పనులు చేపడుతున్నందున ట్రాఫిక్ మళ్లించినట్లు పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఈ నెల 13 వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. వాహనాలను ఇటు వైపు అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పనులు జరుగుతున్నందున నగరవాసులు, వాహనదారులు సహకరించాలని కోరారు.
Next Story

