Thu Apr 02 2026 11:55:23 GMT+0530 (India Standard Time)
రోడ్డుపై 20 అడుగుల గుంత
హైదరాబాద్ లో ఒక్కసారిగా రోడ్డు కుంగి ఇరవై అడుగుల గుంత పడింది. దీంతో వాహనదారులు భయపడిపోతున్నారు

హైదరాబాద్ లో ఒక్కసారిగా రోడ్డు కుంగి ఇరవై అడుగుల గుంత పడింది. దీంతో వాహనదారులు భయపడిపోతున్నారు. చాదర్ ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చాదర్ ఘాట్ వద్ద ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో ప్రజలు భయపడిపోయారు. వెంటనే స్థానికులు జీహెచ్ఎంసీ, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి అటువైపు వాహనాలు రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు.
తప్పిన పెను ప్రమాదం...
దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. గుంత ఇరవై అడుగుల మేర పడటంతో ప్రజలు అటు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో వెంటనే అక్కడ మరమ్మతు చర్యలను అధికారులు చేపట్టారు. ఇటీవల హైదరాబాద్ రోడ్లు తరచూ కుంగిపోతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. గోషామహల్, హిమాయత్ నగర్ లో ఇలాంటి ఘటనలే ఇటీవ జరిగాయి. తాజాగా చాదర్ ఘాట్ వద్ద రోడ్డు కుంగింది.
Next Story

