Fri Dec 26 2025 09:17:29 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : భార్యపై అనుమానంతో దారుణ హత్య
భార్యపై అనుమానంతో దారుణంగా భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది.

భార్యపై అనుమానంతో దారుణంగా భర్త హత్య చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లోని నల్లకుంటలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. పిల్లల ముందే భార్యను పెట్రోల్‌తో కాల్చి చంపి, కూతురిని మంటల్లో భర్త తోసేశారు. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ వివాహం చేసుకున్న దంపతుల మధ్య అనుమానాలు ఈ ఘటనకు దారితీశాయి. నల్గొండ జిల్లా నివాసులైన త్రివేణి, వెంకటేష్ దంపలు ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
పెట్రోలు పోసి నిప్పంటించి...
గత కొంత కాలం నుంచి భార్యపై అనుమానం ఉన్న భర్త వెంకటేష్ భార్య త్రివేణిని చంపేశాడు. వెంకటేష్ భార్యపై అనుమానాలు పెంచుకుని వేధిస్తూ, త్రివేణి పుట్టింటికి వెళ్లిపోవడానికి కారణమైంది. ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చిన కొద్ది రోజుల్లోనే దారుణ హత్య చేశాడు. పిల్లల ముందే పెట్రోల్‌తో దహనం చేశాడు. పిల్లల ముందే పెట్రోల్ పోసి త్రివేణిని నిప్పటించిన వెంకటేష్, అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేశాడు. వారి అరుపులు, కేకలు విని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో త్రివేణి మృతి చెందగా కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వెంకటేష్ ను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

