Thu Mar 19 2026 02:04:42 GMT+0530 (India Standard Time)
Allu Arjun : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయలుదేరారు.

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బయలుదేరారు. ఆయనను పోలీసులు ఇంటికి వెళ్లి భారీ బందోబస్తు మధ్యపోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున్ ను విచారించేందుకు పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చారు. ఈ రోజు ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.
పోలీసు ఆంక్షలు...
ఈ సందర్భంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. పోలీస్ స్టేషన్కు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అధికారుల ఈ ఘటనకు సంబంధించిన విచారణచేపట్టే అవకాశముంది. ఆరోజు జరిగిన ఘటనపై ఆయనను వివరణ కోరే ఛాన్స్ ఉంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story

