Sat Dec 13 2025 19:30:49 GMT+0000 (Coordinated Universal Time)
IBomma : నేడు రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని నేడు రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని నేడు రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. నిన్న తొలి రోజు చంచల్ గూడ జైలు నుండి బషీర్ బాగ్ సీసీఎస్ కు తీసుకువచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. ఐబొమ్మ రవి రెండోసారి విచారణకు మూడురోజులు మాత్రమే న్యాయస్థానం అనుమతించింది. రేపటితో విచారణ ముగియనుంది.
రేపటితో ముగియనున్న కస్టడీ
మూడు రోజులపాటు విచారించనున్న పోలీసులు విదేశీ నిధులు, పాస్ వార్డ్, యూజర్ ఐడీలతో పాటు ఎవరెవరు సహకరించారన్న దానిపై ప్రధానంగా విచారించనున్నారు. గతంలో ఐదు రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకుని విచారించిన పోలీసులకు సహకరించకపోవడంతో మరొకసారి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఎన్జెలా సర్వర్ లో మాస్క్ ఐపిలపై , బెట్టింగ్ యాప్స్ నుండి జరిగిన లావాదేవీలపైన,బెట్టింగ్ యాప్ లావాదేవీలు.. డొమైన్స్ ఇన్వాయిస్ ల ఆధారంగా పోలీసులు విచారించనున్నారు.
Next Story

