Fri Dec 05 2025 08:14:40 GMT+0000 (Coordinated Universal Time)
Hydraa : హైడ్రా కూల్చివేతలు.. ఎన్ని కోట్ల విలువైన స్థలమెంతో తెలుసా?
జూబ్లీహిల్స్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

జూబ్లీహిల్స్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నాలాతో పాటు పార్క్ ను కూడా ఆక్రమించి కొందరు భవనాలను నిర్మించుకున్నారు. అయితే పార్క్ స్థలం కావడంతో అందిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ఈ ఆక్రమణలను కూల్చివేశారు. పెద్దమ్మ గుడి సమీపంలోనే ఈ ఆక్రమణలు జరిగాయి. నాలాతో పాటు పార్క్ స్థలాన్ని కూడా ఆక్రమించడంతో హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం బుల్ డోజర్ ను పంపి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. నాలాతో పాటు రహదారిని కూడా ఆక్రమించారు.
ఆక్రమించిన భవనాలను...
ఆక్రమించి భవనాలను నిర్మించడమే కాకుండా హోటల్, హాస్టల్ కు కూడా అద్దెకు ఇచ్చి నెలకు పది లక్షల రూపాయలు సొమ్ముచేసుకుంటున్నాడు. హైడ్రాకు ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో వెంటనే నోటీసులు ఇచ్చినప్పటికీ కిరాయికి ఉంటున్న వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. దీంతో నాలాతో పాటు రోడ్డు, పార్క్ ను ఆక్రమించి నిర్మించిన భవనాలను కూల్చివేశారు. దీనివల్ల దాదాపు రెండు వందల కోట్ల రూపాయల స్థలం ప్రభుత్వానికి దక్కినట్లయింది.
Next Story

